Nandamuri Mokshagna:నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తుందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగుపెడతాడా..? అని నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా మారుతున్నాడు అని ఆశలు పెట్టుకోవడం, చివరికి అది జరగకపోవడంతో నిరాశ చెందడం అభిమానులకు అలవాటుగా మారిపోయింది. అస్సలు మోక్షజ్ఞకు ఇండస్ట్రీ మీద ఇష్టం ఉందా.. ? లేదా అనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. ఎప్పుడు బాలయ్యను వారసుడు గురించి అడిగినా ఈ ఏడాది.. వచ్చే ఏడాది అంటూ మాట దాటేయడం తప్ప.. క్లారిటీ ఇచ్చింది లేదు. ఇంకోపక్క మోక్షజ్ఞ ఇంకా హీరోకి సరిపడే విధంగా లేడని, బొద్దుగా ఉన్నాడని, లుక్స్ హీరోలా లేవని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కొంత టైమ్ తీసుకుని మళ్లీ హీరోలా మారడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడని వార్తలు వచ్చాయి.
ఇక ఈ మధ్య మోక్షజ్ఞ లుక్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. ఇప్పుడు బరువు తగ్గి మంచి లుక్ లో కనిపిస్తున్నాడు. మంచి ఫిట్ నెస్ తో హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక తాజాగా మోక్షజ్ఞ కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో కుర్రాడు.. కేక పెట్టిస్తున్నాడు. ఇక మోక్షజ్ఞలో అన్నలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కూడా కనిపిస్తున్నారు. ఆ కర్లీ హెయిర్, కళ్లు.. టీనేజ్ లో అన్నలు ఉన్నట్లే.. తమ్ముడు కూడా ఉండడంతో.. బాలయ్య కొడుకా.. మజాకానా.. అన్నలను మించి.. అందంగా తయారయ్యాడు. ఇంక ఆలస్యం చేయకుండా హీరోగా లాంచ్ చేస్తే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఏడాది అయినా బాలయ్య.. కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
