Site icon NTV Telugu

Nandamuri Kalyan Ram: 2024 ఎలక్షన్స్ .. తారక్, నేను ఎవరి సైడ్ ఉంటాం అంటే.. ?

Nkr

Nkr

Nandamuri Kalyan Ram: డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు. ఇక ఏడాది చివరిలో ఎలాగైనా హిట్ అందుకోవాలని డెవిల్ సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన కళ్యాణ్ రామ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నాడు.

మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కళ్యాణ్ రామ్ కనిపిస్తే.. తన సినిమా కన్నా ఎన్టీఆర్ సినిమా గురించే అభిమానులు అడుగుతున్నారు. అందుకు కారణం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ నే నిర్మాత. ఇక డెవిల్ తో పాటు దేవర సినిమా గురించిన విషయాలను కూడా పంచుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల గురించి కూడా మాట్లాడాడు. ఏపీ ఎన్నికలు ఈసారి ఎంతో పోటాపోటీగా ఉన్నాయి. ఒకానొక సమయంలో తారక్, కళ్యాణ్ రామ్ టీడీపీ తరుపున ప్రచారం కూడా చేశారు. ఆ తరువాత తారక్ తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని చెప్పడంతో.. అభిమానులు తారక్ ను పొలిటికల్ వ్యవహారాల్లోకి లాగడం లేదు. తాజాగా ఏపీ ఎలక్షన్స్.. ఈసారి చాలా పోటాపోటీగా ఉన్నాయి. మీరు, తారక్ ఏ సైడ్ ఉండబోతున్నారు.. ? లేకపోతే సైలెంట్ గా చూస్తూ ఉంటారా అన్న ప్రశ్నకు కళ్యాణ్ రామ్ స్పందించాడు. ” మేము ప్రస్తుతం ఏ దారిలో వెళ్తున్నా.. అది కుటుంబ విషయం. అది కుటుంబం ద్వారా వచ్చింది. అందుకే.. కుటుంబం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని.. తరువాత అందరికి చెప్తాం. కుటుంబం అంటే.. నేను, తారక్. మిగిలినవారు కూడా ఉన్నారు. నా స్టేట్మెంట్ గా ఇది నేను ఇవ్వను.. కుటుంబం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి. ఇలా ఇస్తే వేరే విధంగా ఉంటుంది. సినిమా అనేది ఒక పర్స్పెక్టీవ్.. ఇది వేరు. మేము ఇద్దరం ఒక నిర్ణయం తీసుకొని అభిమానులకు చెప్తాం” అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version