NTV Telugu Site icon

Kalyan Ram: ‘డెవిల్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో?

Kalyan Ram Devil

Kalyan Ram Devil

‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘అమిగోస్’ కాగా మరొకటి అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’. ఈ రెండు సినిమాల్లో ‘అమిగోస్’ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక ‘డెవిల్’ సినిమా విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా కనిపించనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పీరియాడిక్ డ్రామా గురించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకి రావట్లేదు. చాలా సైలెంట్ గా డెవిల్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ఒక భారి సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ‘డెవిల్’ లేటెస్ట్ షెడ్యూల్ నుంచి ప్రొడ్యూసర్ అభిషేక్ నామా, దర్శకుడు నవీన్ మేడారం, ఇతర టెక్నిషియన్స్ ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తుంటే ‘డెవిల్’ కోసం ఎలాంటి సెట్స్ వేసారో అర్ధమవుతుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘డెవిల్’ సినిమాలో నటించే ఇతర ఆర్టిస్టుల వివరాలు, టెక్నిషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది.