Site icon NTV Telugu

NKR21: కళ్యాణ్ రామ్ ఏంట్రా ఇంత వైలెంట్ గ ఉన్నాడు…?

Kalyan Ram

Kalyan Ram

NKR21: డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న సినిమా #NKR21 ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ నుండి ప్రొడక్షన్ నెం 2 ని అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ భీకరమైన అవతార్‌లో కనిపించారు. తన పిడికిలికి నిప్పుతో, తన చుట్టూ గూండాలతో కుర్చీపై కూర్చున్న నటుడు తీక్షణంగా చూస్తున్నాడు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నారట. ‘‘కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

Also Read: OTT Release Movies: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. అందరి కళ్ళు ఆ సిరీస్ పైనే..!

అలానే ఈ చిత్రంలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది వరకు రిలీజ్ చేసిన ఆమె గ్లింప్స్‌ పైన కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి పవర్‌ఫుల్‌ లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయశాంతి కనిపించబోతుంది. ఇక ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version