తెలుగువారి ఆరాధ్య దైవమైన తన తాతతో తనను పోల్చవద్దని ఆయన స్థాయిని నేను చేరు కోలేనని ఎన్టీఆర్ మనవడు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఉగాది రోజున చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగింది. కళ్యాణ్ రామ్, హాస్యనటుడు అలీ, D.V.V దానయ్య తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ స్వాగతోపాన్యాసం చేసిన ఈ సభలో ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ గాయని పి.సుశీల, నిర్మాత మైత్రి రవి శంకర్, వ్యాపారవేత్త మువ్వా పద్మయ్య హాజరయ్యారు. ఉగాది సత్కారం తర్వాత అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
Read Also: VNR Trio: చిరు గెస్టుగా నితిన్, రష్మిక క్రేజీ మూవీ లాంచ్ అయ్యింది
ముందుగా బాపూబొమ్మ పురస్కారాన్ని నటి ఈశ్వరీరావు, బాపూరమణల పురస్కా రాన్ని దర్శకుడు హను రాఘవపూడి, మహిళారత్న పురస్కారాన్ని వైద్య రంగానికి చెందిన స్వర్ణలత, నృత్య కళాకారిణి మేనకా పిపి బోరా అందుకున్నారు. ఉత్తమ నటుడి అవార్డును ‘బింబిసార’ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్, ఉత్తమ నటి అవార్డును సమంత తరపున ఆమె బంధువులు స్వీకరించారు. ఉత్తమ చిత్రం అవార్డును ‘బింబిసార’ ప్రతినిధులు అందుకున్నారు. లతా మంగేష్కర్ పురస్కారాన్ని సంగీతదర్శకురాలు శ్రీలేఖ, వీఎస్ఆర్ స్వామి పురస్కారాన్ని సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు స్వీకరించారు.
Read Also:Sridevi: ముగ్గురు చెల్లెళ్లతో అతిలోక సుందరి అరుదైన ఫోటో… అందరితో కలిసి నటించింది ‘అతనొక్కడే’