NTV Telugu Site icon

Amigos: ఇంతకీ ఈ ముగ్గురూ ఎక్కడ కలుస్తారు?

Amigos

Amigos

బింబిసార సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించి సాలిడ్ హిట్ కొట్టాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో, ఆడియన్స్ థియేటర్స్ కి రారేమో అనే అనుమానం అందరిలోనూ ఉన్న టైంలో కంటెంట్ ఉన్న సినిమాని తీస్తే, కొత్త కథని చూపిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు… బ్రేక్ ఈవెన్ మాత్రమే కాదు డబుల్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి అని బింబిసార సినిమాతో ఒక భరోసా కలిగించాడు కళ్యాణ్ రామ్. బింబిసార మూవీతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు అదే జోష్ లో ‘అమిగోస్’ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘అమిగోస్’ సినిమాని రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. అషికా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ మేకర్స్ హైప్ పెంచుతున్నారు.

Read Also: Okkadu: కొత్త సినిమాకి కూడా ఈరేంజ్ లో సెలబ్రేషన్స్ చెయ్యరేమో…

న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అయిన ఈ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చెయ్యడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ కి సంబంధించిన మూడు లుక్స్ ని రిలీజ్ చేశారు, వీటిలో కళ్యాణ్ రామ్ ఇప్పటివరకూ చూపించని వేరియేషన్స్ లో కనిపించాడు. ముఖ్యంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో స్టైలిష్ విలన్ లా ఉన్నాడు. ఈ మూడు రోల్స్ మధ్య ఉన్న లింక్ ఏంటి అనేది బేతాళ ప్రశ్నగానే ఉంది. ముగ్గురూ ఒకేలా ఉన్నారు కదా అన్నదమ్ములు ఏమో అనుకుందాంలే అని స్టొరీ ప్రిడిక్ట్ చెయ్యాలి అనుకుంటే పప్పులో కాలేసినట్లే ముగ్గురూ ఒకరికి ఒకరు ఏమీ కారు అని చిత్ర యూనిట్ చాలా క్లియర్ గా చెప్పేశారు. మరి అస్సలు సంబంధం లేని ఈ ముగ్గురు కళ్యాణ్ రామ్ లు ఎక్కడ కలుస్తారు? ఎందుకు కలుస్తారు? అసలు వీళ్లు ఒకేలా ఎందుకు ఉన్నారు? వీరికి ఉన్న కనెక్షన్స్ ఏంటి లాంటి విషయాల్లో కొంచెమైన క్లారిటీ రావాలి అంటే రేపు ఉదయం బయటకి రానున్న ‘అమిగోస్’ టీజర్ చూడాల్సిందే. రేపు ఉదయం 11:07 నిమిషాలకి అమిగోస్ టీజర్ రిలీజ్ కానుంది మరి అందులో ఏమైనా రివీల్ చేస్తారా లేక ఆడియన్స్ లో సినిమాపట్ల మరింత క్యురియాసిటి పెంచుతారా? అనేది చూడాలి.

Show comments