Site icon NTV Telugu

Mokshagna : నందమూరి వారసుడి లుక్ అదిరిపోయిందిగా..!!

Whatsapp Image 2023 06 10 At 8.44.01 Pm

Whatsapp Image 2023 06 10 At 8.44.01 Pm

నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోల కు ధీటు గా పోటీని ఇస్తూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తో సంచలన విజయం సాధించారు బాలయ్య. రీసెంట్ గా వీరసింహారెడ్డి తో కూడా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.పవర్ ఫుల్ మాస్ సినిమాల కు కేరాఫ్ అడ్రస్ బాలయ్య అని చెప్పవచ్చు.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భం గా ఆయన సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులను బాగా అలరిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కు భగవంత్ కేసరి అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. భగవంత్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోందని చెప్పవచ్చు.అలాగే బాబీ దర్శకత్వం లో ఓ మూవీ ని కూడా చేస్తున్నారు బాలయ్య.

ఇదిలా ఉంటే ఇప్పుడు నటసింహం బాలయ్య వారసుడు గురించి అందరి లో కూడా ఆసక్తి పెరిగింది.. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూడా గతం లోనే మోక్షజ్ఞ డెబ్యూ గురించి మాట్లాడినా. అప్పట్లో అయితే సాధ్యం కాలేదు. బాలయ్య వారసుడు త్వరలో వెండితెర మీద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఆదిత్య 369 సీక్వెల్‌ తో వెండితెర కు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకల్లో మోక్షజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచాడు. అచ్చం హీరో లాగా చేంజ్ అయ్యాడు మోక్షజ్ఞ . ఇప్పుడు అతడి లుక్ నందమూరి అభిమానులను ఎంత గానో ఆకట్టుకుంటుంది. ఆ వేడుకల్లో హ్యాండ్సమ్‌గా కనిపించాడు మోక్షజ్ఞ. ఇక ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్‌ కూడా సోషల్ మీడియాలో నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడు అని తెగ హడావిడి చేస్తున్నారు

Exit mobile version