Site icon NTV Telugu

NTR: నిన్న మెగా ఫ్యామిలీ.. నేడు నందమూరి ఫ్యామిలీ తో నెట్ ఫ్లిక్స్ సీఈఓ భేటీ

Tarak

Tarak

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీని నెట్ ఫ్లిక్స్ ఏదో చేయాలనీ చూస్తోంది అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతగా.. నెట్ ఫ్లిక్స్ ఏం చేసింది అంటే.. టాలీవుడ్ పై కన్నేసింది. ఇప్పటివరకు బాలీవుడ్ తోనే మంతనాలు సాగించిన నెట్ ఫ్లిక్స్ .. ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరుగుతుండగా.. మన తారలను కూడా మచ్చిక చేసుకుంటుంది. ఇందుకోసం డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ సీఈఓనే రంగంలోకి దిగారు. నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్.. నిన్న హైదరాబాద్ లో అడుగుపెట్టిన దగ్గరనుంచి స్టార్ ఫ్యామిలీస్ తో భేటీ అయ్యి.. వారితో ముచ్చటిస్తున్నారు. నిన్నటికి నిన్న మెగా ఫ్యామిలీతో భేటీ అయిన టెడ్ సరండోస్.. నేడు నందమూరి ఫ్యామిలీతో భేటీ అయ్యారు. నిన్న రామ్ చరణ్ ఇంట మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొద్దిసేపు ముచ్చటించిన ఆయన.. నేడు ఎన్టీఆర్ ఇంటికి అతిధిగా విచ్చేశారు.

తారక్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, కొరటాల శివ సైతం టెడ్ సరండోస్ ను కలవడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తారక్ తో టెడ్ సరండోస్ కొద్దిసేపు ముచ్చటించారు. సినిమాల గురించి, ఓటిటీలా గురించి వీరు చర్చించినట్లు తెలుస్తోంది. నిన్న మెగా ఫ్యామిలీతో.. నేడు నందమూరి ఫ్యామిలీతో టెడ్ సరండోస్ భేటీ అవ్వడం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు నెట్ ఫ్లిక్స్ సీఈఓ.. ఇలా టాలీవుడ్ స్టార్స్ ఫ్యామిలీస్ ను మీట్ అవుతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version