NTV Telugu Site icon

Nandamuri Bhargav Ram : హ్యాపీ బర్త్ డే చిన్నోడా.. తండ్రి అంతటోడివి కావాలే

Ntr

Ntr

Nandamuri Bhargav Ram: నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా ఆయన ఎదగడానికి ఎంతో సమయం పట్టింది. నందమూరి లెగసీని కాపాడడంలో ఎన్టీఆర్ సైతం తనదైన కృషి చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ తరువాత ఆ లెగసీని ముందుకు తీసుకొచ్చేది ఆయన కుమారులే. ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి దంపతులకు ఇద్దరు కుమారులు. నందమూరి అభయ్ రామ్.. నందమూరి భార్గవ్ రామ్. నేడు ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ పుట్టినరోజు. దీంతో తారక్ అభిమానులందరూ.. చిన్నోడికి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. భార్గవ్ రామ్.. జూన్ 14, 2018 లో జన్మించాడు. తండ్రి పోలికలు మొత్తంగా దింపేశాడు. భార్గవ్ ను చూస్తే.. అచ్చు చిన్నతనంలో తారక్ ను చూసినట్టే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక ఎన్టీఆర్.. కొద్దిగా ఖాళీ చిక్కినా పిల్లల దగ్గర వాలిపోతాడు. ముఖ్యంగా భార్గవ్.. నాన్న కొడుకు అంట. ఎప్పుడు నాన్నతోనే ఉంటాడట.

Adikeshava: మెగా మేనల్లుడిని కూడా తన అందంతో బుట్టలో పడేసిందమ్మా..

ఇక తారక్ సైతం.. తన కొడుకుల గురించి చెప్పుకొస్తూ.. అభయ్.. ఒక క్వశ్చన్ బ్యాంక్. ఎప్పుడు ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటాడు. నేను చాలాసార్లు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పించుకొనేవాడిని.. వాళ్ళ అమ్మ దొరికిపోతూ ఉంటుంది. ఇక భార్గవ్.. అల్లరికి మారుపేరు.. ఒకచోట కుదురుగా ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అని కొడుకుల గురించి చెప్పి మురిసిపోయాడు. సాధారణంగా తారక్.. తన కుటుంబాన్నీ సోషల్ మీడియాకు ఎంత దూరం పెట్టాలో అంతే దూరం పెడతాడు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆయన తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు. అలా షేర్ చేసిన ఫోటోలను నేడు అభిమానులు షేర్ చేస్తూ చిన్నోడికి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. హ్యాపీ బర్త్ డే చిన్నోడా.. తండ్రి అంతటోడివి కావాలే అంటూ ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం నందమూరి భార్గవ్ రామ్ కు ఐదేళ్లు. ముందు ముందు ఈ ఇద్దరు వారసులు.. తండ్రిలా చిన్నతనంలోనే తెరపై కనిపిస్తారేమో చూడాలి.