Veera Simha Reddy: మొదటి రోజే హాఫ్ సెంచరీ… బాలయ్య ఊచకోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నట సింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ జోనర్ లో బాలయ్య ఊచకోత మొదలు పెట్టాడు, అన్ని సెంటర్స్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే దాదాపు మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా, ఓవరాల్ గా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ట్వీట్ చేశారు. బాలయ్య కెరీర్ లోనే డే 1 హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన సినిమాగా వీర సింహా రెడ్డి కొత్త చరిత్ర సృష్టించింది. బోయపాటి శ్రీను కూడా బాలయ్య హిట్ ఇచ్చాడు కానీ ఈ రేంజ్ హిట్ ఇవ్వలేదు. ఒక ఫ్యాన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు గోపీచంద్ మలినేని ప్రూవ్ చేశాడు. బాలయ్య గెటప్, డైలాగ్స్, తమన్ మ్యూజిక్, గోపీచంద్ మలినేని డైరెక్షన్ ఇలా ప్రతి విషయంలో వీర సింహా రెడ్డి ప్యూర్ ఫన్ స్టఫ్ ని ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో వీర సింహా రెడ్డి సినిమా నాన్-రాజమౌళి రికార్డుని క్రియేట్ చేసింది. ముఖ్యంగా సీడెడ్ లో అయితే ఆర్ ఆర్ ఆర్, బాహుబలి తర్వాత ఆ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టిన సినిమాగా వీర సింహా రెడ్డి హిస్టరీ క్రియేట్ చేసింది. నైజాం బాలయ్యకి చాలా వీక్ జోన్ కానీ వీర సింహా రెడ్డి సినిమా నైజాంలో రచ్చ లేపే కలెక్షన్స్ ని రాబడుతుంది. పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, గుడ్ నంబర్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ వీర సింహా రెడ్డి సినిమాని బాక్సాఫీస్ దగ్గర మరింత స్ట్రాంగ్ గా మార్చాయి. బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో హిట్ కొడతాడు అని ఊహించారు కానీ మరీ కెరీర్ హైయెస్ట్ రేంజులో, ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోల రికార్డులు కూడా చెల్లా చెదురు అయ్యే రేంజులో హిట్ కొడతాడు అని ఎవరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఉన్న ఇదే జోష్ కంటిన్యు అయితే వీర సింహా రెడ్డి సినిమా మండే లోపే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత 🔥🔥
VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses Massive 54 CR on Day 1 🔥
Book your tickets now!
– https://t.co/SzgoK7HjZVNatasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/PrfB4kckhX
— Mythri Movie Makers (@MythriOfficial) January 13, 2023
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!