NTV Telugu Site icon

Nandamuri Balakrishna: వీరసింహారెడ్డి కి షాక్.. నెట్టింట సినిమా మొత్తం లీక్

Balakrishna

Balakrishna

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు థియేటర్ లో రిలీజ్ అయ్యింది. నందమూరి నట సింహం మరోసారి గర్జించింది అని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కు తప్ప.. నార్మల్ ఆడియెన్స్ కు పనికిరాదు అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. వీరసింహారెడ్డి చిత్ర బృందానికి షాక్ ఇచ్చారు లీక్ రాయుళ్లు. థియేటర్ లో బొమ్మ పడిన గంటకే వీరసింహారెడ్డి నెట్టింట్లో ప్రత్యక్షమయింది.

హెచ్ డి క్వాలిటీతో వీరసింహా రెడ్డి సినిమా అంటూ లీకు రాయుళ్లు నెట్టింట పప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక పైరసీ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పైరసీ లింక్ లను ఓపెన్ చేయవద్దని కోరుకొంటున్నారు. ఇక మరోపక్క టీమ్ కు ఇది ఊహించని షాక్.. మొదటి గంటలోనే సినిమా లీక్ అవ్వడంతో ఓపెనింగ్స్ తగ్గే అవకాశం ఉంది. దీంతో మేకర్స్ యాంటీ ఫైరసీ స్క్వాడ్ ను ఏర్పాటు చేసి సోషల్ మీడియా లో స్ప్రెడ్ అయిన లింక్ లను తీసివేయిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. మరి ఫైరసీ ఎఫెక్ట్ వీరసింహారెడ్డి కలక్షన్ల మీద ఏమైనా పడుతుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.

Show comments