Site icon NTV Telugu

Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్..

Chandrabbu

Chandrabbu

Nandamuri Balakrishna: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. అగ్గి రాజేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆయన అరెస్ట్ అయ్యి 20 రోజులు దాటినా కూడా ఇప్పటివరకు బెయిల్ రాలేదు. ఆ తరువాత చంద్రబాబుపై మరో కేసు కూడా పెట్టారు. తండ్రి అరెస్ట్ ను ఖండిస్తూ నారా లోకేష్.. భర్త కోసం భువనేశ్వరి, టీడీపీ నేతలు.. అందరు పోరాడుతూనే ఉన్నారు. ఇంకోపక్క టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ సైతం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇక చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం ఎంతోమందిని కలిచివేస్తున్న విషయం. ఒకానొకసమయంలో చిత్ర పరిశ్రమకు చంద్రబాబు ఎంతో చేసాడని, కానీ, ఇప్పుడు ఆయన అరెస్ట్ ను ఖండించడానికి సినీ ప్రముఖులు కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇక నిర్మాత అశ్వినీదత్, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి వారు మాత్రం చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచారు.

Tollywood: సీక్వెల్స్ అమ్మా.. సీక్వెల్స్.. సినిమా ఏదైనా.. పార్ట్ 2 పక్కా

ఇక చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని చాలామంది విమరిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఈ విషయమై తారక్ ఒక ట్వీట్ పెట్టింది కూడా లేదు. అయితే.. ఇప్పుడప్పుడే ఎన్టీఆర్ రాజకీయాల్లో రావాలని అనుకోవడం లేదని, అందుకే వీటికి దూరంగా ఉన్నాడని ఆయన అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఎన్టీఆర్ స్పందించకపోవడంపై బాలకృష్ణ రియాక్ట్ అయ్యాడు. “చంద్రబాబు అరెస్ట్‌పై సినిమా రంగం నుంచి ఎవరు ఖండించకపోయిన నేను పట్టించుకోను.. అని చెప్పుకొచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం లేదు ఈ విషయం లో ఎలా చూస్తారు అన్న ప్రశ్నకు.. ఐ డోంట్ కేర్ బ్రో ” అని భగవంత్ కేసరి స్టైల్లో సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version