Site icon NTV Telugu

Nandamuri Balakrishna: ఆమె నన్ను భరిస్తోంది.. నా దృష్టిలో ఆమె అన్ స్టాపబుల్

Bala

Bala

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక సినిమాలతో పాటు ఆహా ఓటిటీ కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే షో చేస్తున్నాడు. సీజన్ 1 ను విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య సీజన్ 2 ను కూడా అంతే ఎనర్జీతో మొదలుపెట్టాడు. నిన్ననే ఈ షో ప్రోమో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య తన భార్య వసుంధరను పొగడ్తలతో ముంచెత్తారు. మీకు ఎవరు అన్ స్టాపబుల్ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య మాట్లాడుతూ “నా దృష్టిలో నా భార్య వసుంధర అసలైన అన్ స్టాపబుల్ . నేను సినిమాలను, హాస్పిటల్ ను చూసుకుంటూ బిజీగా ఉన్నా, ఇంటికి రాకపోయినా నన్ను, నా కుటుంబాన్ని పట్టించుకోని ఎంతో జాగ్రత్తగా చూసుకొంటుంది. ఇంకా చెప్పాలంటే ఆమె నన్ను భరిస్తోంది. నా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తోంది. అందుకే నాకు సంబంధించినంత వరకు ఆమె అన్ స్టాపబుల్”అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ షో లో చిరు, నాగార్జున, వెంకటేష్ వస్తారా..? అని అడిగితే వాళ్లకు డేట్స్ ఖాళీగా ఉంటే తప్పకుండా పిలుద్దామని చెప్పుకొచ్చారు. ఇక మొదటి సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పిన బాలయ్య తనను ఇంట్లో తన మనవళ్లు బాలా అని పిలుస్తారని చెప్పి షాకిచ్చాడు. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి

Exit mobile version