Site icon NTV Telugu

Nandamuri Balakrishna: నేను సీఎంని కలవను.. నాకావసరం కూడా లేదు

NBK

NBK

నందమూరి బాలకృష్ణ మొదటిసారి ఏపీ టికెట్ రేట్స్ వివాదంపై నోరు విప్పారు. మంగళవారం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య.. సీఎం జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ని వేధిస్తున్న టికెట్ రేట్స్ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ ని కలిసి చర్చించిన సంగతి తెల్సిందే. ఇక ఆ భేటీకి నందమూరి బాలకృష్ణ ఎందుకు రాలేదు.. ఆయనను ఆహ్వానించలేదా అని అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. ఇక తాజాగా ఈ ప్రశ్నకు బాలకృష్ణ సమాధానం చెప్పారు. ” సీఎం ని కలవడానికి రమ్మని పిలిచారు. నేనురానని చెప్పను. నేను సినిమా బడ్జెట్ పెంచాను.. సీఎం జగన్ ని కలవను.. టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడే ‘అఖండ’ సినిమా సక్సెస్ అయ్యింది. అదే ఒక ఉదాహరణ” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version