నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిన తారకరత్నని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నాడు. హాస్పిటల్ దగ్గర ఉండే తారకరత్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, నిరంతరం అక్కడే ఉన్నాడు బాలయ్య. 23 రోజుల పోరాటం తర్వాత మరణించిన తారకరత్న ఆఖరి కార్యక్రమాలని కూడా బాలయ్య దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ ని తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ ని తెస్తున్న సమయంలో అంబులెన్స్ వెనకే వచ్చిన బాలయ్య, ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం పక్కనే నిలబడి ఉన్నాడు. విజయ్ సాయి రెడ్డి, నందమూరి రామకృష్ణ, ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ కూడా వేదికపైనే నిలబడి ఉన్నారు. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Read Also: Tarakaratna: ఫిల్మ్ ఛాంబర్ కి తారకరత్న భౌతికకాయం…