NTV Telugu Site icon

Nandamuri Balakrishna: మాస్ కా దాస్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య..

Bala

Bala

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఒక్కసారి ఎవరైనా నచ్చితే.. లైఫ్ మొత్తం వారిని గుర్తుపెట్టుకుంటాడు. అందుకే అంటారు.. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే అని. తాజాగా బాలయ్య.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక గ్యాంగ్ ఆఫ్ గోదావరి సెట్ లో బాలయ్య మెరిసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ విషయాన్నీ విశ్వక్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

“GOG సెట్ లో మన బాలయ్య సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మీ అద్భుతమైన సపోర్ట్ కు చాలా చాలా థాంక్స్ సర్. ఎప్పుడు నేను మిమల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మీ రాకతో మా చిత్రబృందంలో మరింత జోష్ పెరిగింది. దురదృష్టవశాత్తూ నా పూర్తి చిత్రాలను అప్‌లోడ్ చేయడం సాధ్యపడలేదు. ఎందుకంటే సినిమాలోని లుక్ రివీల్ అవుతుంది కాబట్టి.. ఆ పనిచేయలేకపోయాను. సినిమా రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా నా ఫుల్ పిక్చర్స్ రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు ఫ్రేమ్ లా ఉన్న బాలయ్య బాబు చాలు.. ఫైర్ అంతే” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మొదటినుంచి కూడా విశ్వక్ కు బాలయ్య మంచి సపోర్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి కాంబోలో ఒక షో రావాలని అభిమానుకు చెప్పుకొస్తున్నారు.

Show comments