Site icon NTV Telugu

Nandamuri Balakrishna: ఆ సినిమాకు పవన్ మాత్రమే సెట్ అవుతాడని చెప్పా

Balayya

Balayya

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒకపక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క ఆహా కోసం అన్ స్టాపబుల్ 2 షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే.. ఇక బాలయ్య అంటే పంచులు, ప్రాసలు, నవ్వులు, కేరింతలు అన్ని ఉంటాయి. అలాగే మొదటి ఎపిసోడ్ సొంత బావ చంద్రబాబుతో చేసి మెప్పించాడు. ఇక రెండో ఎపిసోడ్ గా కుర్ర హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లను పిలిచి ఒక ఆట ఆదుకున్నాడు. గాడ్ ఆఫ్ మాస్ ముందు ఈ మాస్ హీరోలు తేలిపోయారు. ఇక ఈ కుర్ర హీరోల మధ్యకు వచ్చి నలిగిపోయాడు కుర్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. బాలయ్య తనదైన చలాకీతనంతో ముగ్గురితోనూ వినోదాన్ని పండించాడు. అంతే కాకుండా కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా బయటికి లాగాడు. పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా వచ్చిన భీమ్లా నాయక్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. కాగా, మొదట భీమ్లా నాయక్ ప్లేస్ లో అనుకున్నది పవన్ కళ్యాణ్ ను కాదట.. అవునా మరెవరు అనుకుంటున్నారా..? ఇంకెవడు నందమూరి బాలకృష్ణనే.. ఈ కథ రీమేక్ హక్కులు తీసుకోగానే నిర్మాతలు ముందు బాలకృష్ణ దగ్గరకు వెళితే.. ఆయనే కథ విని పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా బావుంటుందని చెప్పారట.. ” భీమ్లా నాయక్ ఎవరు ఫస్ట్ హీరో” అని బాలకృష్ణ అడుగుగా.. నాగవంశీ మాట్లాడుతూ “మీరే సర్.. మీ చుట్టూ తిరిగి.. మిమ్మల్ని అడిగి, సినిమా చూసి మీరే కదా సర్ నాకు సాజిస్ట్ చేశారు కళ్యాణ్ గారికి అయితే బావుంటుందని” చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. అదిరా బాలయ్య మంచితనం అంటూ బాలయ్య అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version