NTV Telugu Site icon

Nandamuri Balakrishna: బ్రేకింగ్ న్యూస్.. బాలకృష్ణకు రెండో ఫ్యామిలీ.. చంద్రబాబు ముందే బట్టబయలు

Nbk

Nbk

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇక మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి అన్ స్టాపబుల్ షో ను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన ఘనత బాలయ్యది. గతేడాది సీజన్ 1 తో వచ్చి పిచ్చెక్కించిన బాలయ్య.. ఈ ఏడాది సీజన్ 2 తో రచ్చ చేయడానికి సిద్దమయ్యాడు. ఇక ఇప్పటికే ఈ షో ప్రోమోలతో ఆసక్తి పెంచేసిన మేకర్స్ మొదటి ఎపిసోడ్ ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో షూట్ చేస్తున్నట్లు తెలిపి ఇంకా అంచనాలను పెంచేశారు. చంద్రబాబు.. రాజకీయ నాయకుడు. ఆయన వస్తే మొత్తం పొలిటికల్ వార్ నడుస్తుందని, రాజకీయ చర్చ మాత్రమే వస్తుందని అనుకున్నారు. ఈ ఎపిసోడ్ లో అంత ఫన్ ఏముంటదిలే అని అభిమానులు అనుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అన్ స్టాపబుల్ ట్యాగ్ లైనే దెబ్బకు థింకింగ్ మారిపోవాలా.. దానికి తగ్గట్టుగానే ఈ ఎపిసోడ్ ప్రోమో చూసిన వారికి దెబ్బకు థింకింగ్ మారిపోయిందని చెప్పాలి. అస్సలు వీరిద్దరూ రాజకీయ నాయకులుగా కాకుండా ఇంట్లో బావాబామ్మర్దులు సరదాగా మాట్లాడుకున్నట్లు అనిపించింది.

ఇక ఈ షో లో బాలయ్యను చంద్రబాబు ఆటపట్టించడం విశేషం. అన్ స్టాపబుల్ షో ను తన రెండో ఫ్యామిలీగా బాలయ్య అభివర్ణిస్తూ.. ” నాకు రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి.. ఒకటి రోడ్ నెం 45 లో వసుంధర, పిల్లలు.. రెండోది యాక్చువల్ గా గతేడాది స్టార్ట్ అయ్యింది. చాలా డీప్ గా కనెక్ట్ అయిపోయా లాస్ట్ ఇయర్ నుంచి” అని బాలయ్య చెప్పగానే అందుకు చంద్రబాబు “వసుంధరకు ఫోన్ చేసి చెప్పుదాం. బ్రేకింగ్ న్యూస్ ఇది” అంటూ పంచ్ వేశాడు. ఇక దీంతో నవ్వడం బాలయ్య వంతయ్యింది. ప్రోమో మొత్తం ఇలాంటి పంచులతోనే సాగింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఎపిసోడ్ అక్టోబర్ 14 న ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. మరి మొదటి ఎపిసోడ్ తోనే బావాబామ్మర్దులు ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.

Show comments