NTV Telugu Site icon

Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ

Balakrishna Nurse Issue

Balakrishna Nurse Issue

Nandamuri Balakrishna Responds On Comments About Nurses In Unstoppable Show: నర్సులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ రేగిన దుమారంపై సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా స్పందించారు. తాను నర్సులను కించపరిచారనంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తన మాటల్ని కావాలనే వక్రీకరించారంటూ ఫేస్‌బుక్ మాధ్యమంగా వివరణ ఇచ్చారు. ‘‘నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు సేవలు అందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’’ అంటూ బాలయ్య వివరించారు.

Kangana Ranaut: నాపై గూఢచర్యం చేస్తున్నారు.. రణ్‌బీర్‌పై కంగనా బాంబ్

కాగా.. అన్‌స్టాపబుల్ షోలో భాగంగా తనకు వైద్యం అందించిన నర్సు గురించి మాట్లాడుతూ బాలయ్య నోరు జారారు. తనకు ఒక బైక్‌ యాక్సిడెంట్‌లో దెబ్బలు తగిలాయని.. కానీ కాలు జారి పడటంతో గాయాలు అయ్యాయని అబద్ధం చెప్పి వైద్యం చేయించుకోవాలని అనుకున్నానని బాలయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఒక నర్సు తన వద్దకు వచ్చిందని, ఆమెను చూసి ‘భలే అందంగా ఉందిలే’ అని అన్నానని చెప్పారు. తనకు దెబ్బలెలా తగిలాయని ఆ నర్సు అడగ్గానే.. అబద్ధం చెప్పాలనుకున్న తన ఆలోచనని విరమించుకొని, నిజం చెప్పానని తెలిపారు. అయితే.. ఆ నర్సుని ఉద్దేశిస్తూ ‘భలే అందంగా ఉందిలే’ అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఏపీ నర్సింగ్‌ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఫేస్‌బుక్ మాధ్యమంగా స్పందించి, తన మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే పశ్చాత్తాపడుతున్నానని చెప్పి, వివాదానికి ముగింపు పలికారు.

Bihar Railway Track: బిహార్‌లో మరో వింత ఘటన.. రైల్వే ట్రాక్ దొంగలించిన దుండగులు