Site icon NTV Telugu

Balakrishna: మాతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు ఉన్నాయి

Balakrishna Satyanarayana

Balakrishna Satyanarayana

కైకాల సత్యనారాయణని చూడగానే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఆయన ఆహార్యం అచ్చ తారకరాముడి లాగే ఉంటుంది. అందుకే ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాల్లో తారకరామారావుకి డూపుగా కైకాల సత్యనారాయణ నటించాడు. ఆయన హఠాన్మరణం టాలీవుడ్ ని కుదిపేసింది. ఊహించని ఈ మరణ వార్త గురించి నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ… “కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ బాలయ్య ఒక నోట్ రిలీజ్ చేశాడు.

Fkorkw7vqaaykjr

Exit mobile version