NTV Telugu Site icon

Chalapathi Rao: చలపతి రావుకు నివాళులు అర్పించిన బాలయ్య..

Balayya

Balayya

Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గత నెల 24 వ తేదీన మృతిచెందిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందారు. సినీ ప్రముఖులు అందరు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పార్థివ దేహాన్ని కళ్లారా చూసి నివాళులు కూడా అర్పించారు. అయితే ఆయన పార్దివ దేహాన్ని చూడడానికి నందమూరి బాలకృష్ణ రాలేక పోయారు. బాలకృష్ణకు, చలపతిరావుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్ అంటే చలపతిరావుకు అభిమానం. ఆ అభిమానమే బాలయ్య మీద కూడా ఉండేదని ఆయన చెప్తూ ఉండేవారు.

ఇక వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ముఖ్యంగా చెన్నకేశవరెడ్డి లో వీరి కాంబోలో వచ్చే సీన్స్ అదిరిపోతాయి. ఇక ఆ బంధంతోనే బాలయ్య, చలపతిరావును కడసారి చూడడానికి అయినా వస్తారనుకున్నారు. కానీ, వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో ఉండడంతో బాలయ్య రాలేకపోయాడు. ఇక నేడు చలపతిరావు సంస్కరణ సభకు బాలయ్య హాజరై.. చలపతిరావుకు నివాళులు అర్పించాడు. చలపతిరావు ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించాడు. ఆయన కుమారుడు రవిబాబుని, వారి కుటుంబానికి సానుభూతిని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments