NTV Telugu Site icon

NBK: ఇందుకే మా బాలయ్య బంగారం…

Nbk

Nbk

నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ‘మా బాలయ్య బంగారం’ అనే ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ రెండు విషయాలు జరగడానికి కారణం బాలయ్య చేసిన ఒక మంచి పని బయటకి రావడమే. స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధినేతగా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. తన తల్లికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అనే సంకల్పంతో క్యాన్సర్ హాస్పిటల్ ని అన్ని విధాలా మెరుగు పరచి, పేషంట్స్ కి మెరుగైన వైద్య సేవలు అందేలా చేస్తున్న బాలయ్య, తాజాగా ఒక ఇంటర్ చదువుకునే అమ్మాయికి సాయం చేశాడు. అనంతపూర్ కి చెందిన ఇంటర్ విద్యార్థిని బోన్ క్యాన్సర్ తో బాధ పడుతోంది, ఆపరేషన్ కి 10 లక్షలకి పైన ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. దీంతో అంత మొత్తం డబ్బులు లేని అమ్మాయి తల్లిదండ్రులు క్యాన్సర్ తో బాధ పడుతున్న కూతురుని హాస్పిటల్ తీసుకోని వెళ్ళలేకపోయారు.

ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ, వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ అమ్మాయితో కూడా మాట్లాడిన బాలయ్య, క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయించాడట. పీఆర్లు అయిన వంశీ శేఖర్ లు ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇది వైరల్ అవ్వడంతో బాలయ్య మనసు బంగారం అంటూ అందరూ బాలయ్యకి కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు. బాలయ్యకి కోపం ఎక్కువ కానీ మనసు చాలా మంచిది, అందుకే ఆయన్ని అందరూ భోలా శంకరుడు అంటారు. మరోసారి బాలయ్య స్వభావాన్ని అందరికీ తెలిసేలా చేసింది ఈ ఇంటర్ అమ్మాయి సంఘటన. రీసెంట్ గా అన్ స్టాపబుల్ షోలో కూడా ఇలానే ఒక చిన్న పాప, బాలయ్య సాయంతో క్యాన్సర్ ని దాటి ప్రాణాలతో ఆ గండాన్ని గట్టెక్కింది. ఆ పాపని చూసిన సమయంలో బాలయ్య చాలా ఎమోషనల్ అయ్యాడు.