నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల తన ఎడమచేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ సర్జరీ కారణంగానే బాలయ్య ఆహా లో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో ని కొద్దిరోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన చేతికట్టుతోనే దర్శనం ఇస్తున్నారు. ఇటీవల అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆయన చేతికట్టుతోనే హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన చేయి బాగానే ఉండడంతో అలాగే ‘అన్ స్టాపబుల్’ షో కూడా చేస్తానని బాలయ్య అందంతో మళ్లీ ఆహాలో ‘అన్ స్టాపబుల్’ మొదలయ్యింది.
తాజాగా బాలయ్య కొత్త ఎపిసోడ్ ప్రోమోను ఆహా నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఎనర్జీ ఈజ్ బ్యాక్ అంటూ బాలయ్య ప్రోమో ని వదిలారు. ఇందులో బాలయ్య చేతికట్టుతోనే రచ్చ చేశారు .. మూడు వారాలు గ్యాప్ వచ్చింది..అందరు ఒకటే ఫోన్లు.. మెసేజ్లు.. నేను ఎలా ఉన్నాను అని కాదు.. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అని.. వారం.. వారం రావడానికి నేను సీరియల్ని కాదు.. సెలబ్రేషన్నీ” అంటూ బాలయ్య తనదైన పంథా లో రచ్చ చేశారు. స్టేజీపై బాలయ్య జోరు చూసిన అభిమానులు సంతోషంలో సందడి షురూ చేశారు. ఇకపోతే ఈ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనేది ఇంకా రివీల్ చేయలేదు.. మరి ఈసారి బాలయ్యతో రచ్చ చేయడానికి ఏ స్టార్ విచ్చేస్తున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.
