Site icon NTV Telugu

Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. బాలయ్య సినిమా క్యాన్సిల్..?

Bala

Bala

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ సినిమా తరువాత బాబీ.. బాలయ్యతో జతకట్టాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భగవంత్ కేసరి షూటింగ్ ను పూర్తి చేసి.. బాబీ సినిమాను పట్టాలెక్కించాలని బాలయ్య ప్లాన్ చేశాడు. ఇంకా అంతా సవ్యంగా జరిగితే.. ఈ నెల 29 న ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చేసింది. కానీ, అంతలోనే చంద్రబాబు అరెస్ట్ పెద్ద సమస్యనే తీసుకొచ్చి పెట్టింది.

Anushka Shetty: మెగాస్టార్ సరసన స్వీటీ.. ఈ వయస్సులో ఆ సాహసం అవసరమా..?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. బాలయ్య.. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నాడు. టీడీపీ నేతగా బాలయ్య.. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ ను సీరియస్ గా తీసుకున్నాడు. అందుకే.. రాజకీయాల్లోనే తలమునకలు అవుతున్నాడని తెలుస్తోంది. ఇంకోపక్క భగవంత్ కేసరి కూడా కొద్దిగా షూటింగ్ పెండింగ్ ఉంది. అది కూడా చంద్రబాబు అరెస్ట్ కారణంగా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ సమస్యలు అన్ని చక్కబడ్డాకా.. బాలయ్య మళ్లీ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక బాబీ సినిమా అయితే మాత్రం ఈ కారణం వలన షూట్ క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సమస్యలు మొత్తం క్లియర్ అయ్యేవరకు బాలయ్య సెట్ లో అడుగుపెట్టడని సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version