NTV Telugu Site icon

Nandamuri Balakrishna: ఈ సమయంలో ఖచ్చితంగా ఇది అవసరం.. వావ్ బాలయ్య

Bala

Bala

Nandamuri Balakrishna:..సినిమా కేవలం మూడు గంటల వినోదం మాత్రమే కాదు. సమాజానికి ఇచ్చే ఒక మెసేజ్. ఎన్నో సినిమాలు చూసి జనాలు మారారు.దానికి నిదర్శనం.. ఈ ఏడాది రిలీజ్ అయిన బలగం. సినిమా చూసాక విడిపోయిన అన్నదమ్ములు కలిశారు అని ఎన్నో వార్తలు వచ్చాయి. తల్లిదండ్రులు, స్నేహితులు ఎంత చెప్పిన వినని కుర్రాళ్ళు.. తాం ఫేవరేట్ హీరో .. సినిమాలో చెప్తే వింటాడు. అది సినిమాకు ఉన్న గొప్ప పవర్. సినిమాను వినోదానికి చూసేవాళ్ళు కొంతమంది అయితే .. ఆ సినిమాలో చూపించిన చెడును తీసుకోనివారు కొంతమంది. కానీ, సినిమాలో చూపిన మంచిని స్వీకరించే ప్రేక్షకుడు ఒక్కడైనా ఉండకపోతాడా.. ? అని మేకర్స్.. ఏదో ఒక మెసేజ్ ను పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలోని ఒక సీన్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే చిన్నారులకు బాలకృష్ణ గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో అర్థమయ్యేలా చెప్పే సీన్.

The World Of Nawab: పవన్ హీరోయిన్ సినిమాలో ట్విస్ట్ లు అదిరిపోతాయంట..

సమాజంలో కామాంధులు.. ఎక్కడనుంచో ప్రత్యేకంగా రావడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే కుక్కల్లా వెంటపడుతున్నారు. చిన్నా, పెద్ద, వావి, వరుస ఏమి చూడకుండా కామంతో మృగల్లా తయారవుతున్నారు. అన్న, తమ్ముడు, తండ్రి, తాత, స్కూల్లో టీచర్.. పక్కింటి అంకుల్.. మేనమామ.. ఇలా సొంతవారే.. చిన్నారులను చిదిమేస్తున్నారు. అసభ్యంగా చిన్నారులను తాకుతూ వారి బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నారు. ఆ వయస్సులో ఏది మంచి టచ్, ఏది చెడు టచ్ అని తెలుసుకోలేక.. కన్నతల్లికి చెప్పుకోలేక తమలో తామే బాధపడుతూ ..అలానే పెరుగుతూ ఒక ఫోబియాలోకి వెళ్లిపోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య.. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చి.. అందరి ప్రశంసలను అందుకున్నాడు. లైంగిక స్పర్శ, అసభ్యకరంగా ఎక్కడ తాకితే అమ్మకు చెప్పాలి అనేది ఎంతో చక్కగా వివరించాడు. ఈ డైలాగ్స్ రాసింది అనిల్ అయినా.. బాలయ్య నోటి నుంచి రావడంతో .. వాటికి మరింత పవర్ వచ్చిందని చెప్పాలి. ఈ సమయంలో ఈ మాటలు ఖచ్చితంగా అవసరం. ప్రతి చిన్నారి తెలుసుకోవాల్సిన పాఠం. తల్లిదండ్రులు.. ఈ విషయాలను పిల్లలతో పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ, ఈ సినిమా ద్వారా ఎంతోమంది ఈ విషయం తెలుసుకొనే అవకాశం ఉంది. ఏది ఏమైనా బాలయ్య.. ఈ మాటలను చెప్పడం అభినందనీయం. వావ్ బాలయ్య అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.