Balayya: భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి నట సింహం బాలకృష్ణ, లేటెస్ట్ గా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు. శ్రీలీలా ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ సెట్స్ లోకి కాజల్ అగర్వాల్ జాయిన్ అయ్యింది. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని దసరా బరిలో నిలబెడుతూ మేకర్స్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 19న బాలయ్య-అనీల్ రావిపూడిల సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని రివీల్ చేస్తూ “భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది” అంటూ మేకర్స్ ఒక పోస్టర్ ని విడుదల చేశారు. బాలయ్య ఉగ్రరూపంలో గన్నులు పట్టుకొని నడిచొస్తున్న పోస్టర్ అదిరిపోయింది. యాక్షన్ ఎపిసోడ్ నుంచి కట్ చేసి డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
అక్టోబర్ 19న విడుదల చేస్తున్నారు అంటే భగవంత్ కేసరి టీం లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. అక్టోబర్ 24న దసరా పండగ ఉంది, సో భగవంత్ కేసరి సినిమాకి ఆరు రోజుల లాంగ్ గ్యాప్ కలిసొచ్చే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి తెలంగాణ యాసలో బాలయ్యతో పర్ఫెక్ట్ గా మాట్లాడిస్తే చాలు, మరో వంద కోట్లు సినిమా పడినట్లే. ఈ మూవీపై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి, వీటిని మరింత పెంచుతూ మేకర్స్ ఒక సాలిడ్ ట్రైలర్ ని కట్ చేసి వదిలితే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరిపోవడం గ్యారెంటీ. బాలయ్య అనగానే సాలిడ్ మ్యూజిక్ ఇస్తున్న తమన్, మరోసారి భగవంత్ కేసరి కోసం రంగంలోకి దిగాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో భగవంత్ కేసరి నందమూరి ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టి పంపడం పక్కా. మరి అక్టోబర్ 19న భగవంత్ కేసరి బాక్సాఫీస్ పైన ఎలాంటి దాడి చేస్తాడు అనేది చూడాలి.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది🔥#Bhagavanthkesari Grand Worldwide Release on October 19th, 2023💥#BhagavanthKesariOnOCT19
Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @JungleeMusicSTH @sahugarapati7… pic.twitter.com/2uAeo5wWRH
— Shine Screens (@Shine_Screens) July 22, 2023
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!