NTV Telugu Site icon

Bhagavanth Kesari: అదేంటి రాజా… హెచ్చరిక లేకుండా బాలయ్యని దించేసావ్

Bhagavanth Kesari

Bhagavanth Kesari

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. హిట్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఇటీవలే భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేసారు. తెలంగాణ యాసలో “నెలకొండ భగవంత్ కేసరి”గా బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే టీజర్ ఒక రేంజులో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. ఈసారి సింహం వేట మాములుగా ఉండదు అంటూ అనీల్ రావిపూడి రోజు రోజుకి ఫ్యాన్స్ లో అంచనాలు పెంచుతూనే ఉన్నాడు. ఈ దసరాకి ఆయుధపూజా చేద్దాం అంటూ భగవంత్ కేసరి రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేసారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అంతా అక్టోబర్ 19 కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, దసరా అంతకన్నా పెద్ద హిట్ కొడతాడేమో చూడాలి.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా “70 రోజుల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఆగమనం” అంటూ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ట్వీట్ వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డైరెక్ట్ గా బాలయ్య ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఊహించకుండా బయటకి వచ్చిన ఈ పోస్టర్ ని చూసి బాలయ్య ఫ్యాన్స్ స్వీట్ షాక్ కి గురవుతున్నారు. భగవంత్ కేసరి ఆడియన్స్ ముందుకు రావడానికి ఇంకా 70 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాని ఇప్పటినుంచే ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే ఈ దసరా బాలయ్య బాక్సాఫీస్ దగ్గర ఊహించని కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ.