Site icon NTV Telugu

Bhagavanth Kesari: అప్పుడే అయిపోలేదు… చాలా ఉన్నాయ్ లోపల… దాచారు

Bhagvanth Kesari N

Bhagvanth Kesari N

నందమూరి నట సింహం బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీలా స్పెషల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ, వీరసింహ రెడ్డి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ థమన్ ‘NBK 108’కి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని అక్టోబర్ 21న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్, జూన్ 10న బాలయ్య బర్త్ డే కావడంతో నందమూరి ఫాన్స్ కి రెండు రోజుల ముందే స్పెషల్ ట్రీట్ ఇస్తూ NBK 108 టైటిల్ ని రివీల్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్ పెట్టి NBK 108 టైటిల్ ని ‘భగవంత్ కేసరి’గా అనౌన్స్ చేసారు.

బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అనే హింట్ ఇస్తూ అనిల్ రావిపూడి టైటిల్ ఫాంట్ డిజైన్ లోనే మ్యాజిక్ చేసాడు. బాలయ్య కూడా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే బాలయ్య ఫాన్స్ కి బర్త్ డే ట్రీట్ ఇక్కడితో అయిపోలేదు, చాలా ఉన్నాయ్ లోపల దాచాం అంటున్నారు అనిల్ రావిపూడి, థమన్ అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్స్. జూన్ 10న మాస్ ఫీస్ట్ బయటకి రాబోతుంది, ప్రస్తుతం కంటెంట్ లోడింగ్ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేసాడు. ఈ మాస్ ఫీస్ట్ వీడియోని థమన్ సూపర్బ్ బీజీఎమ్ ఇచ్చాడట. మరి బాలయ్య నటించిన గత రెండు సినిమాలకి స్పీకర్లు బద్దలయ్యే రేంజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన థమన్, ఈసారి ‘భగవంత్ కేసరి’ ఎలాంటి మ్యాజిక్ చేసాడో చూడాలి.

 

Exit mobile version