Site icon NTV Telugu

Balakrishna : ప్లేస్ ఏదైనా.. బాలయ్య గ్రేస్ తగ్గేదేలేదేస్!

Balakrishna

Balakrishna

తెలుగు సిని దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ తాజాగా తన కొత్త Range Rover కారు రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన ఫ్యాన్సీ నంబర్ TG09F0001 సినీ అభిమానుల్లో, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సందర్భంగా ఆర్టీఓ ఆఫీస్ వద్ద తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇందులో బాలకృష్ణ లుక్, గ్రేస్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Read More: Meerut: భర్త “గడ్డం” తీయనందుకు, మరిదితో లేచిపోయిన మహిళ..

బాలకృష్ణ తన Range Rover కారుకు TG09F0001 అనే ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. ఈ నంబర్‌ను ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌లో జరిగిన వేలంలో రూ. 7.75 లక్షలు చెల్లించి సాధించారు. ఈ వేలం ద్వారా రవాణా శాఖ ఒక్క రోజులోనే ఖైరతాబాద్ జోన్ నుంచి రూ. 37,15,645 ఆదాయాన్ని ఆర్జించింది, ఇందులో బాలకృష్ణ బిడ్ అత్యధికమైనదిగా నిలిచింది.

Read More: Nani: ‘HIT 3’ వైలెన్స్ ఎంజాయబుల్‌.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం

ఏప్రిల్ 30, 2025న ఆర్టీఓ ఆఫీస్ వద్ద తీసిన బాలకృష్ణ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో బాలకృష్ణ సింపుల్‌ అయినా అద్భుతమైన గ్రేస్‌తో కనిపించారు. ఆయన లుక్, నడవడిక, రునవ్వు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ, “ప్లేస్ ఏదైనా… బాలయ్య గ్రేస్ తగ్గేదే లేదు!” అని కామెంట్స్ పెడుతున్నారు. “బాలయ్య లుక్ చూడండి… ఇది కదా స్టార్ అంటే!”, “TG09F0001 నంబర్‌తో BMWలో బాలయ్య రోడ్డు మీద దిగితే ఊరకుండదు!” వంటి కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Exit mobile version