Nandamuri Balakrishna: టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కుటుంబం గురించి ఏ ఒక్కరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబం అంటే ఒక బ్రాండ్ అన్న విషయం అందరికి తెల్సిందే. ఇక బాలయ్య గురించి అయితే ప్రపంచం మొత్తం ఆయనకు అభిమానులే. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క ఎమ్మెల్యే గా విధులు నిర్వహిస్తూనే ఆహాలో అన్ స్టాపబుల్ 2 షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక షోకు గెస్టులు ఎవరు వచ్చినా హైలైట్ గా నిలిచేది మాత్రం బాలయ్యే. ఈ మూడవ ఎపిసోడ్ లో కూడా కుర్ర హీరోలు అడివి శేష్, శర్వానంద్ కంటే ఎక్కువ బాలయ్య చిలిపి మాటలకే అభిమానులు ఫిదా అయ్యారు.
ఇక ఈ షో లో బాలయ్య తన ఎఫైర్స్ గురించి నోరు విప్పాడు. శర్వా జోక్ గా “మీరు ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు కదా మీ గురించి ఎవరితోనూ ఎలాంటి అఫైర్స్ రూమర్స్ రాలేదు ఎలా మేనేజ్ చేశారు”.. అని అడిగాడు. దానికి బాలయ్య ఘాటు సమాధానమే చెప్పుకొచ్చాడు. ” మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది” అంటూ చెప్పడంతో కుర్ర హీరోలు ఇద్దరు షాక్ తో బిగుసుకుపోయారు. నిజం చెప్పాలంటే అప్పట్లో సోషల్ మీడియా అనేది చాలా తక్కువ. హీరోల గురించి, సినిమాల గురించి అప్పుడప్పుడు పేపర్ లో వచ్చినప్పుడు చూడడమే తప్ప జనాలకు ఏది తెలిసేది కాదు. అంతేకాకుండా అప్పట్లో గాసిప్స్ రాయాలంటే చాలామంది పెద్ద పెద్ద కుటుంబాలు అని భయపడేవాళ్ళంట. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఏదైనా నిర్మొహమాటంగా పోస్ట్ చేస్తున్నారు.
