NTV Telugu Site icon

Namrata: నమ్రత.. గౌతమ్ కు అన్నయ్య ఉన్నాడని చెప్పలేదే..

Mahehs

Mahehs

Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కోసం సినిమాలను కూడా వదిలేసి.. అతడిని, పిల్లలను, ఘట్టమనేని కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపిస్తుంది. ఇంకోపక్క హోటల్ బిజినెస్ ను, మహేష్ యాడ్స్ కు సంబంధించిన పనులను కూడా ఆమె చూసుకొంటుంది. ఇక నిత్యం తమ పిల్లల ఫోటోలను, మహేష్ క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులలో జోష్ పెంచుతూ ఉంటుంది. కాగా, తాజాగా నమ్రత షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. గౌతమ్, సితారతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. ముగ్గురు ఎంతో సరదాగా ముచ్చటిస్తున్నట్లు కనిపించారు. గౌతమ్ తో ఉన్న వ్యక్తిని సడెన్ గా చూస్తే అతనికి అన్నలా కనిపిస్తున్నాడు కదా.. కొంచెం జాగ్రత్తగా చూడండి.. ఆయన అన్న కాదు నాన్న. అవును అతను మన సూపర్ స్టార్ మహేష్ బాబు. అయ్యా.. అంటూ షాకింగ్ లుక్ ఇవ్వకండి.. మహేష్ ఎలా ఉంటాడో అందరికి తెల్సిందే. ఇక ఈ ఫొటోలో కూడా బాబు.. లుక్ తో అదరగొట్టేశాడు.

Pawan Kalyan: ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ.. లక్కీ ఛాన్స్ పట్టేశావ్..?

వైట్ అండ్ వైట్ డ్రెస్.. హెయిర్ కు హెయిర్ బ్యాండ్ పెట్టి, కూలింగ్ గ్లాసెస్ తో బాబు.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. నమ్రత గారు.. మీకు పెద్ద అబ్బాయి ఉన్నారని చెప్పలేదేంటండి.. గౌతమ్ కు అన్నయ్య ఉన్నాడా ..? అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో మహేష్ .. సమ్మర్ వెకేషన్ కు గ్యాప్ తీసుకొని కుటుంబంతో చిల్ అవుతున్నాడు. త్వరలోనే మళ్లీ మహేష్ ఈ షూటింగ్ లో అడుగుపెట్టనున్నాడు.