నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది. భర్త మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆమె దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క ఇద్దరు పిల్లలకు తల్లిగా వారిని ప్రేమతో పెంచుతోంది. నమ్రత ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. మహేష్ తో పెళ్లి తరువాత ఆమె ఎప్పుడూ సినిమాల వైపు తిరిగి చూసింది లేదు. ఇక ఒకప్పుడు నమ్రత .. చాలా సాదాసీదాగా కనిపిస్తూ వచ్చేది. కానీ, ఇప్పుడు నమ్రత రూటు మార్చింది. ఇద్దరు పిల్లలు చేతికి వచ్చేసారు. దీంతో ఆమె తన అందంపై శ్రద్ద పెట్టడం మొదలుపెడుతుంది. నిత్యం జిమ్ చేస్తూ.. మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో నమ్రత.. ఎక్కువ పార్టీస్ కు అటెండ్ అవుతుంది. రిచ్ లేడీస్ తో పాటు ఆమె అన్ని పార్టీలకు వెళ్లడం.. డిజైనర్ డ్రెస్ లతో మెరవడం చేస్తుంది.
తాజాగా నమ్రత రాయల్ లుక్ లో అదరగొట్టింది. ఢిల్లీ గప్ షప్ లో బాగా ఎంజాయ్ చేసినట్లు ఆమె తెలిపింది. ఇక భారీ క్రిస్టలైన్ ఎంబ్రాయిడరీ వర్క్ తో రూపొందించిన డిజైనర్ శారీ, బ్లౌజ్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నాయి. ఈ చీరలో నమ్రత మరింత అందంగా కనిపిస్తుంది. ఏదిఏమైనా సూపర్ స్టార్ వైఫ్ అంటే .. ఆ మాత్రం ఉండాలిగా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సినిమాల్లోకి రాకపోయినా నమ్రత పలు బిజినెస్ లతో బిజీగా మారింది.
