Site icon NTV Telugu

Suresh Babu: సురేష్ బాబు, రానా మీద క్రిమినల్ కేసు నమోదు…

Suresh Babu

Suresh Babu

సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఫిలిం నగర్ భూ వివాదం కొత్త మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికీ, సురేష్ బాబు-రానాకి మధ్య ల్యాండ్ వివాదం నడుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై గతంలోనూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ప్రమోద్ కుమార్… సురేష్ బాబు తమను రౌడీల సాయంతో దౌర్జన్యంగా స్థలం ఖాళీ చేయించారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థలం ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని ప్రమోద్ కుమార్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోకపోవడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రమోద్ కుమార్ పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానా తో సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేస్తూ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. నాంపల్లి కోర్ట్ రానా, సురేష్ బాబులని విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. మరి ఈ వివాదంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version