Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Najabhaja Lyrical Video From God Father Out

God Father: ‘నజభజ జజరా…’ ‘గాడ్ ఫాదర్’ అదిగోరా!

Published Date :September 27, 2022 , 5:53 pm
By Subbarao N
God Father: ‘నజభజ జజరా…’ ‘గాడ్ ఫాదర్’ అదిగోరా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

God Father: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5న జనం ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంత పూర్ లో సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోని “నజభజ జజరా…” అంటూ మొదలయ్యే పాటను మంగళవారం లిరికల్ వీడియోగా రిలీజ్ చేశారు. “నజభజ జజరా… నజభజ జజరా… గజగజ వణికించే గజరాజడిగోరా…” అంటూ పాట మొదలవుతుంది.

థమన్ బాణీలకు అనంత్ శ్రీరామ్ ఈ పాటను పలికించారు. శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర ఈ గీతాన్ని ఆలపించారు. చిరంజీవి ఫైటింగ్ ఇమేజెస్ పై ఈ లిరికల్ వీడియో రూపొందింది. “ఘీమ్ ఘీమ్ ఘీంకరించిన ఐరావతం… గిర్రుగిర్రున తొండము తిప్పితె చిత్తడై పోతావ్…” అంటూ పాట సాగుతుంది. “అడవి తల్లికి అన్నయ్య వీడురా… కలబడితే కథకళిరా…” అనీ ఈ గీతంలో పదాలు చోటు చేసుకున్నాయి. పాటలో పదాలు కథకు అనువుగా సాగి ఉండవచ్చు. కానీ, గీత రచయిత పాట ఆరంభంలోనే కథానాయకుణ్ణి గజరాజుతో పోల్చారు. అలాగే గజం చేసే ‘ఘీంకారాన్ని’ పొందు పరిచారు. అంటే ‘మత్తేభాన్ని’ గుర్తు చేసే ప్రయత్నం సాగింది. కానీ చిత్రంగా రచయిత ‘చంపకమాల’ వృత్తంలోని గణాక్షరాలు “నజభజ జజరా…” అంటూ పాటను మొదలు పెట్టడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ‘మత్తేభం’లోని “సభరన మయవ” ఎందుకని రచయిత విస్మరించి, ‘గజరాజు’కు ‘నజభజ జజరా…’ జోడించారో ఆయనే వివరిస్తే కానీ తెలియదు. ఏది ఏమైనా ‘గాడ్ ఫాదర్’లోని ఈ “నజభజ జజరా…” మెగాస్టార్ అభిమానులను విశేషంగా అలరిస్తుందని చెప్పవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • Director Mohan Raja
  • God Father
  • Najabhaja Lyrical Video

తాజావార్తలు

  • బిర్యానీ ప్రియులరా.. జర ఇది చూడండి.. బంజారాహిల్స్‌లో కుళ్ళిన బిర్యానీ కలకలం

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions