Site icon NTV Telugu

Kingdom : కుబేర కలెక్షన్లపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్

Nagavamsi

Nagavamsi

Kingdom : విజయ్ హీరోగా వచ్చిన కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్లు పెంచుతోంది. ఈ మూవీ కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ స్పందించాడు. మేం మూవీని రిలీజ్ చేసింది వీకెండ్ లో కాదు. గురువారం రిలీజ్ చేశాం. గురువారం తర్వాత మూడు రోజులు వీకెండ్ ఉంది. ఆదివారం వరకు కలెక్షన్లు పెరుగుతాయి. రెండో వారం కూడా మూడు రోజులు వీకెండ్ ఉంది. కాబట్టి అది మాకు ప్లస్ అవుతుంది. ఈ నడుమ ఏ సినిమాకు అయినా కలెక్షన్లు పెద్దగా రావట్లేదు.

Read Also : Vijay Deverakonda : విజయ్ కోసం మారువేషంలో వెళ్లిన రష్మిక

మొన్న వచ్చిన కుబేర మూవీకి భారీ బజ్ క్రియేట్ అయింది. మూవీ చూసిన వారంతా అద్భుతంగా అంటూ పొగిడేశారు. కానీ అసలు కలెక్షన్లు ఎంత అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కింగ్ డమ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. మూవీని థియేటర్లకు వెళ్లి చూసే వారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా తగ్గిపోయారు. అందుకే మూవీకి సూపర్ హిట్ టాక్ వస్తున్నా కలెక్షన్లు ఆ స్థాయిలో ఉండట్లేదు. కింగ్ డమ్ ఆల్రెడీ చాలా ఏరియాల్లో లాభాల్లోకి వచ్చేస్తోంది. రెండో వారం కల్లా అన్ని ఏరియాల్లో లాభాలు చూస్తారు అంటూ చెప్పుకొచ్చాడు నాగవంశీ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Also : Kingdom : ఇంతకీ కింగ్ డమ్ హిట్టా కాదా..?

Exit mobile version