NTV Telugu Site icon

Nagashaurya: ‘రంగబలి’ షూటింగ్ సెట్లోకి అంబులెన్స్.. అసలు విషయం బయటపెట్టిన నాగశౌర్య

Nagashaurya Interview On Rangabali Movie

Nagashaurya Interview On Rangabali Movie

Nagashaurya interview for rangabali Movie: నాగశౌర్య, హీరోగా కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ ‘రంగబలి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయికగా నటిస్తుండగా ఈ సినిమా టీజర్‌, థియేట్రికల్, పాటలకు మాంచి రెస్పాన్ వచ్చింది. జూలై 7న విడుదల కానున్న నేపథ్యంలో హీరో నాగశౌర్య మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలని పంచుకున్నారు. ఇక ఆయన మాట్లాడుతూ ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ రోజు మొదలుపెట్టడమే చాలా ఎనర్జీతో పాజిటివ్ గా ఉంటుందని, అలాగే ఈ సినిమా చూసిన తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తానని చెప్పానని, సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకంతోనే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులకు సినిమా గురించి ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నానని అంటే రంగబలి చాలా మంచి సినిమా కాబట్టే అని అన్నారు.

Niharika Konidela: ఎవడేమన్నా నాకు దాంతో సమానం.. నిహారిక వీడియో వైరల్

ఇక కొత్త దర్శకుడు పవన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? అని అడిగితే దర్శకుడు, నటుడికి స్పేస్ ఇవ్వాలని, ఆ స్పేస్ పవన్ ఇచ్చాడని శౌర్య అన్నారు.ఏ విషయంలో కూడా ఒత్తిడి తీసుకొవద్దని, ఏ సాయం కావాలన్నా చేస్తానని పవన్ కి ముందే చెప్పానని, తను చెప్పింది చెప్పినట్లు గానే పవన్ తీశాడని అన్నారు. నాకు నా సినిమాల విషయంలో అనుభవం వుంది, ఎక్కడ కరెక్ట్ గా జరుగుతుందో చెప్పలేను కానీ ఎక్కడ తప్పు జరుగుతుందో అర్ధమైపోతుందని ఆ అనుభవాన్ని, పవన్ విజన్ ని జోడించి అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలిగామని అన్నారు. ఇక షూటింగ్ ప్రాసెస్ లో హెల్త్ ఇష్యూ వలన సెట్స్ లోకి అంబులెన్స్ వచ్చిందని విన్నాం.. రిస్క్ అనిపించలేదా ? అని అడిగితే నేను వచ్చిందే ప్రేక్షకులని మెప్పించడానికి అని, ఇప్పుడున్న పోటీకి ప్రతి ఒక్కరూ ఎక్స్ టార్డినరిగా యాక్ట్, డ్యాన్స్, యాక్షన్.. అన్నీ చేస్తున్నారు, ఇలాంటి సమయంలో మనమూ ది బెస్ట్ ఇవ్వాలని శౌర్య అన్నారు. ఈ క్రమంలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఒకొక్కసారి గాయాలు అవుతాయి, మనం ఎంచుకున్న వృత్తిలో ఇవన్నీ భాగమే కదా కష్టపడితేనే సక్సెస్ వస్తుందని ఆయన అన్నారు.