Nagarjuna – Konda Surekha : మంత్రి కొండా సురేఖకు భారీ ఊరట దక్కింది. ఆమె మీద నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసును వాపసు తీసుకున్నాడు. దీంతో కొండా సురేఖ ఓ పెద్ద సమస్య నుంచి బయట పడ్డట్టు అయింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ స్వయంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసుపై విచారణ జరిగింది.
Read Also : Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ పై సందీప్ రెడ్డి అప్డేట్..
అయితే మంత్రి కొండా సురేఖ ఇప్పటికే రెండు సార్లు నాగార్జున ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పడంతో నాగార్జున కేసు విత్ డ్రా చేసుకున్నారు. 2024 అక్టోబరు 2న హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. నాగచైతన్య, సమంత విడాకులు కావడానికి కారణం మాజీ మంత్రి కేటీఆర్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై నాగార్జున ఫ్యామిలీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. సినీ ఇండస్ట్రీ మొత్తం మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. ఆమె వ్యాఖ్యలపై నాగార్జున BNS సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే రెండు సార్లు విచారణకు నాగార్జున, కొండా సురేఖ హాజరయ్యారు. దీన్ని పెద్దది చేసుకోవద్దనే ఉద్దేశంతో కొండా సురేఖ నిన్న మరోసారి ఎక్స్ లో క్షమాపణలు చెప్పండో కేసు వాపసు తీసుకున్నాడు నాగార్జున.
