కింగ్ నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన చిత్రం ‘శివ’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై యార్లగడ్డ సురేంద్ర, అక్కినేని వెంకట్ నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. శివ సినిమా నాగార్జునకు మాస్ ఇమేజ్ తేవడమే కాక.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో టాలీవుడ్ ధోరణిని మార్చడమే కాకుండా.. టెక్నికల్‌గానూ ట్రెండ్ సెట్ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా.. నవంబర్ 14న శివ రీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సోమవారం స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆర్జీవీ, నాగార్జున మాట్లాడారు.
36 ఏళ్ల క్రితం శివ సినిమా చూసిన నాగేశ్వర రావు గారు ఏమన్నారు? అని ఓ రిపోర్టర్ అడగగా.. నాగార్జున బదులిచ్చారు. ‘నాన్న సినిమా చూసిన రెండు రోజుల తర్వాత నాతో మాట్లాడారు. ఇప్పటికే సినిమాకు మంచి టాక్ వచ్చింది. బాగున్నా అయినా కూడా సినిమాలో కామెడీ లేదు, అదీ లేదు-ఇది లేదు, ఆడవాళ్లకు నచ్చదు.. అంటూ రకరకాల టాక్స్ వస్తూనే ఉన్నాయి. పంజాగుట్టలో నాన్న, నేను కారులో వెళ్తున్నాం. అప్పుడు శివ సినిమా గురించి మాట్లాడారు. సినిమా చాల పెద్ద హిట్ అవుతుంది, చాలా బాగా చేశావ్ అన్నారు. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో నాకే తెలియదన్నారు. చాలా సంతోషించా’ అని నాగార్జున చెప్పారు.
Also Read: Shiva Sequel: నాగ చైతన్య-అఖిల్‌లో ‘శివ’ సీక్వెల్ ఎవరితో.. ఆసక్తికర సమాధానం ఇచ్చిన ఆర్జీవీ!
‘శివ చిత్రంకి ఇంత ఆదరణ ఉంటుందనుకోలేదు. 36 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కోసం కలుస్తామని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా కోసం రాము చాల కష్టపడ్డారు. అప్పుడు ఎంత ఇష్టపడి సినిమా చేశారో.. రీ రిలీజ్ కోసం ఆంటే కష్టపడ్డారు. ఆరు నెలల నుంచి ఎంతో ఇష్టంతో వర్క్ చేశారు. మణిరత్నం గారితో గీతాంజలి సినిమా చేసిన అనంతరం రాము నా వద్దకు వచ్చి శివ కథ చెప్పారు. రెండు చిత్రాలు చాలా బిన్నం. మణిరత్నం, ఆర్జీవీలు మాస్టర్స్. ఇద్దరి సెన్సిబిలిటీస్ నాకు ఇష్టం. రెండు సినిమాలు చాలా అద్భుతంగా ఆడాయి. ఆ సమయంలో ఎంతో ఆనందపడ్డాను’ అని కింగ్ నాగార్జున తెలిపారు.
శివ చూడగానే నాన్న ఏమన్నారు!#RGV #Nagarjuna #Shiva #Amala #ShivaReRelease #NTVENT pic.twitter.com/dTnFTdXtVG
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) November 10, 2025
