Site icon NTV Telugu

హైద‌రాబాద్‌లో నాగ్ మూవీ చిత్రీకరణ

కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో హైరేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో ప్రారంభించారు. ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో నాగార్జున‌, గుల్ ప‌నాంగ్‌, అనిఖా సురేంద్ర‌న్ త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను ప్రస్తుతం చిత్రీక‌రిస్తున్నారు. ఈ సందర్భంగా మేక‌ర్స్ లొకేష‌న్‌లో నాగార్జున వ‌ర్కింగ్ స్టిల్స్‌ను విడుద‌ల చేశారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో మెప్పించ‌బోతున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. ఇంకా టైటిల్ ఖరారు చేయ‌ని ఈ చిత్రానికి ముకేశ్. జి సినిమాటోగ్రాఫ‌ర్‌. బ్ర‌హ్మ క‌డ‌లి ఆర్ట్‌, రాబిన్ సుబ్బు, న‌భా మాస్ట‌ర్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Exit mobile version