Site icon NTV Telugu

Akkineni Nagarjuna: నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమా..?

Nag

Nag

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమా..? అంటే అవును అనే మాటనే ఎక్కువ వినిపిస్తుంది. అందుకు కారణం నాగ్.. సినిమాలకు గ్యాప్ ఇవ్వడమే. అప్పుడెప్పుడో ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమాను ప్రకటించింది లేదు. ఒకపక్క ఆయన తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ .. వరుస సినిమాలను ప్రకటిస్తూ.. రిలీజ్ లు కూడా ప్రకటిస్తున్నారు. కానీ, నాగ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం అక్కినేని అభిమానులను కలవరపెడుతుంది. ఘోస్ట్ తరువాత నాగ్.. ఒక మలయాళం సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత రచయిత బెజవాడ ప్రసన్నను డైరెక్టర్ గా చేసే బాధ్యత నాగ్ తీసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో ఏది నిజం కాదని తెలుస్తోంది. ఇక ఇంకోపక్క బిగ్ బాస్ కు కూడా నాగ్ రెస్ట్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఇకనుంచి ఏ సీజన్ కు నాగ్ హోస్ట్ గా చేయను అని చెప్పినట్లుసమాచారం. దీంతోనే ఇప్పటివరకు బిగ్ బాస్ ఇంకా స్టార్ట్ కాలేదట.

Harish Shanker: రిపోర్టర్ కు పేలింది.. స్టేజి మీదనే ఇచ్చిపడేసిన డైరెక్టర్

అసలు నాగ్.. ఏం ఆలోచిస్తున్నాడు. సినిమాలకు గ్యాప్ ఇస్తున్నాడా..? కెరీర్ కు రెస్ట్ ఇస్తున్నాడా..? అనేది తెలియడం లేదని అక్కినేని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక మరోపక్క నాగ్ వారసులు కూడా విజయాలను అందుకుంటుంది లేదు.. కుర్ర హీరోలు పాన్ ఇండియా సినిమాలు అంటూ దూసుకెళ్తుంటే.. ఇంకా అక్కినేని హీరోలు ఆ దారిలో అడుగు కూడా పెట్టడం లేదు. ఈ మధ్యనే ఏజెంట్, కస్టడీ సినిమాలతో వారసులు కూడా పరాజయాలను అందుకున్నారు. అసలు అక్కినేని కుటుంబానికి ఏమైంది..? పడినా లేచి నిలబడ సత్తా ఉన్నగల హీరో నాగ్.. కానీ, ఈసారి లేస్తాడా..? అనేది డౌట్ గా ఉంది అంటున్నారు. ఇప్పటికైనా నాగ్ తన తదుపరి సినిమాను ప్రకటించకపోతే.. కచ్చితంగా నాగార్జున రెస్ట్ తీసుకోవడానికే పరిమితమని చెప్పేస్తారు ట్రోలర్స్. మరి నాగ్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Exit mobile version