NTV Telugu Site icon

Akkineni Nagarjuna: కృష్ణ అంత్యక్రియలకు రాని నాగార్జున.. ఎందుకు..?

Nag

Nag

Akkineni Nagarjuna: సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. ఈరోజుతో ఆనాటి ఒక జనరేషన్ కు తెర ముగిసింది. టాలీవుడ్ అంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు అని చెప్పుకొస్తారు. ఈ ఐదుగురు తారలు నేటితో గగనంలో ధృవ తారలుగా మిగిలారు. కృష్ణ పార్థివదేహానికి కడసారి వీడ్కోలు పలకడానికి టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. మెగాస్టార్ నుంచి కుర్ర హీరోలు విజయ్ దేవరకొండ వరకు ప్రతి ఒక్కరు కృష్ణకు నివాళులు అర్పించి మహేష్ బాబును ఓదార్చారు. అయితే కృష్ణ పార్థివదేహాన్ని చూడని ఏకైక హీరో నాగార్జున. రెండు రోజులుగా ఆయన ఎక్కడ కనిపించలేదు. దీంతో నాగ్ ఎక్కడ అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

కృష్ణ కుటుంబానికి, అక్కినేని కుటుంబానికి సత్సంబంధాలు ముందు నుంచి బాగానే ఉన్నాయి, కృష్ణతో కలిసి నాగ్ వారసుడు అనే సినిమా కూడా తీశాడు. ఇక కృష్ణతో ఎంత ప్రేమతో ఉండేవాడో నాగ్.. మహేష్ తో కూడా అంతే ప్రేమగా ఉండేవాడు. అలాంటి నాగ్.. కృష్ణ మరణవార్త విని ట్వీట్ మాత్రం చేశారు కానీ, ఎందుకు కృష్ణను చూడడానికి రాలేదు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ వారసులు అఖిల్, చైతన్య మాత్రమే కృష్ణ పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చారు. ఒకవేళ నాగ్ వేరే దేశంలో ఉండడం వలన రాలేదు అని చెప్పడానికి కూడా నాగ్ వేరే ఇతర ప్రాజెక్ట్స్ లో లేడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి నాగ్.. ఎందుకు కృష్ణ అంత్యక్రియలకు రాలేదని ఆరా తీస్తున్నారు. మరి ఈ విషయమై నాగ్ ఏమైనా స్పందిస్తాడో చూడాలి.