NTV Telugu Site icon

Akkineni Nagarjuna: కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న నాగ్.. ఎన్ని లక్షలో తెలుసా.. ?

Nag

Nag

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. గ్యాప్ ఇచ్చాడు అనడం కన్నా వచ్చింది అని చెప్పొచ్చు. గతేడాది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు మరో సినిమాను ప్రకటించింది లేదు. అంతే కాకుండా మీడియా ముందుకు కూడా చాలా రేర్ గా కనిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం నాగార్జున గురించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. నాగ్ తాజాగా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ కారుల హవా నడుస్తున్న విషయం తెల్సిందే. కియా కారుల వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నాగ్ సైతం కియా ఈవీ 6 కారును కొనుగోలు చేశాడు. దీని విలువ సుమారు రూ. 60- 70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. కియా యాజమాన్యం.. నాగ్ కు కంగ్రాట్స్ చెప్తూ ఆ ఫోటోను షేర్ చేసింది. ఫోటోలో నాగ్, అమలతో పాటు కారు కీస్ అందుకున్నట్లు కనిపిస్తోంది.

Baby: మిడిల్ ఫింగర్ గా హీరోయిన్ చూపించడమేంటీ బ్రదరూ

ఇక ఎలక్ట్రిక్ కారు యొక్క ప్రత్యేకతలు అందరికి తెల్సినవే. ఇందులో డ్రైవర్ సీటును 10 రకాలుగా అడ్జెస్ట్ చేసుకొనే వెసులుబాటు ఉంది. వైర్ లెస్ ఛార్జర్, స్మార్ట్ కీ బటన్ ఉంటుంది. ఇక నాలుగన్నర నిముషాలు ఛార్జింగ్ పెడితే చాలు దాదాపు 100 కి.మీ వెళ్లొచ్చు. ప్రస్తుతం ఈ కారు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నాగ్ సినిమాల విషయానికొస్తే.. నెట్ ఫ్లిక్స్ కోసం నాగ్ ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన డిటేల్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.