Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. నా సామి రంగ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలుగా నటించగా.. ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగార్జున.. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. తన భార్య అమల గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ లిస్ట్ లో అక్కినేని నాగార్జున- అమల పేరు టాప్ 10 లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. అమల అంటే నాగ్ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అమల వెజిటేరియన్. జంతు సంరక్షకురాలు. నాగ్ నాన్ వెజిటేరియన్. ఇక ఎప్పుడు ఇష్టంగా ఫుడ్ తినే నాగ్ కు అమల వండిపెడుతుందా.. ? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగ్ మాట్లాడుతూ.. ” అమల వంట చేస్తుంది.. కానీ, నాకు నచ్చిన వంట చేసి పెట్టదు. తను వెజిటేరియన్. మాంసం ముట్టదు. మొదటి నుంచి కూడా ఆమె అలాగే ఉంది. నేను ఇంట్లో చికెన్ తింటా.. కానీ, తను చేయదు” అని చెప్పుకొచ్చాడు. ఇక బట్టలు, నగలు కొనాలంటే.. ఇక్కడ తీసుకుంటారా.. ? విదేశాల్లో తీసుకుంటారా.. ? అన్న ప్రశ్నకు.. ” ఇక్కడ కష్టం.. విదేశాల్లోనే షాపింగ్ చేస్తాం. ఇక.. నగలు విషయానికొస్తే.. అమలకు బంగారం ఇష్టం ఉండదు. బంగారం కొంటే .. ఎవరో ఒకరికి ఇచ్చేస్తుంది. కుక్కలకు కూడా నాన్ వెజ్ పెట్టదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
