Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagabandham Trailer: టాలీవుడ్లో సరికొత్త మైథోలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి పెంచేసింది. కేవలం భక్తిరస చిత్రంగా కాకుండా.. పురాతన రహస్యాలు, విధి రాత, దైవిక శక్తుల కలయికతో ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ట్రైలర్లో చూడవచ్చు. శతాబ్దాల నాటి ఒక రహస్యం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాగి ఉన్న పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన ‘బ్రహ్మ కమలం’ అనే పురాతన వస్తువును చేజిక్కించుకోవాలని ఒక దుష్టశక్తి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మానవాతీత శక్తులు, పురాతన అంచనాలు, ఆధ్యాత్మిక రక్షకులు రంగంలోకి దిగుతారు. లార్డ్ శివ, శక్తివంతమైన నాగసాధువుల ఆగమనం.. చివరగా అలౌకిక రక్షణ శక్తి అయిన ‘నాగబంధం’ చుట్టూ సాగే కథాంశం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది.
డైరెక్టర్ అభిషేక్ నామా కేవలం మైథాలజీకే పరిమితం కాకుండా, దీనికి ట్రెజర్ హంట్, మర్చిపోయిన చరిత్ర, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌ను జోడించి కథను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ సృష్టించిన అద్భుతమైన టెంపుల్ సెట్స్, పవిత్ర స్థలాలు విజువల్స్‌కు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. హీరో విరాట్ కర్ణ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నగార్కర్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్ఐకె స్టూడియోస్ (NIK Studios), అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపూరెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు. మైథాలజీ, ఫాంటసీ, మిస్టరీ ప్రేమికులకు ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయిన ‘నాగబంధం’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ఆసక్తి రేకెత్తిస్తున్న నాగబంధం ట్రైలర్
పూర్తిస్థాయి మైథలాజికల్ మూవీగా జులై 3న ప్రేక్షకుల ముందుకు
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో ప్రామిసింగ్ గా విజువల్స్
బ్రహ్మ కమలం, అనంత పద్మనాభ స్వామి నేపథ్యంలో మూవీ#Nagabandham #NagabandhamTrailer #ViratKarna#AbhishekNama pic.twitter.com/Aure8EyTVm
— NTV Breaking News (@NTVJustIn) June 19, 2026
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!