Site icon NTV Telugu

Nagababu: కోడలు వెబ్ సిరీస్.. మామ రివ్యూ.. అదిరిపోయిందిగా

Nagababu

Nagababu

Nagababu: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత నటించిన మొదటి వెబ్ సిరీస్ మిస్. పర్ఫెక్ట్. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించిన ఈ సిరీస్ కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఇక ఈ సిరీస్ ఫిబ్రవరి 2 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. మొదటిరోజు నుంచి ఈ సిరీస్ కు మంచి పాజిటివ్ టాక్ అందుతుంది. ఇక తాజాగా ఈ సిరీస్ పై నాగబాబు రివ్యూ ఇచ్చాడు. కోడలి వెబ్ సిరీస్ ను మామగారు మెచ్చేసుకున్నారు. తప్పకుండా ఈ సిరీస్ చూడమని తన అభిమానులకు రిఫర్ కూడా చేశాడు. ట్విట్టర్ వేదికగా నాగబాబు ట్వీట్ చేస్తూ.. “నా ఫేవరెట్ లావణ్య నటించిన ఈ అద్భుతమైన వెబ్ సిరీస్‌లో ఇప్పుడే చూసాను. ఇది చూడటానికి చాలా గ్రిప్పింగ్ గా, సరదాగా ఉంటుంది. హాట్‌స్టార్‌లో దీన్ని చెక్ చేయాలని నేను బాగా సిఫార్సు చేస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మిస్ పర్ఫెక్ట్ కథ విషయానికొస్తే.. ఒక OCD ఉన్న అమ్మాయి.. కరోనా సమయంలో తన అపార్ట్మెంట్ లో ఉన్న చెఫ్ తో ప్రేమలో పడుతుంది. తానెవరో చెప్పకుండా పనిమనిషిగా అతడికి దగ్గరవుతుంది. ఇక వీరి ప్రేమను బయటపెట్టడానికి ఒరిజినల్ పనిమనిషి, ఆమె తమ్ముడు ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి ప్రేమించిన అమ్మాయి అబద్దం చెప్పిందని హీరో ఆమెను దూరం పెడతాడు. చివరకు ఈ జంట కలిశారా.. ? అసలు పనిమనిషి ఎందుకు అదంతా చేయాల్సివచ్చింది అనేది కథ.. ?. మిస్ పర్ఫెక్ట్ లావణ్యగా మెగా కోడలు అదరగొట్టింది. బోర్ కొట్టకుండా నవ్వుతూ అన్ని ఎపిసోడ్స్ చూసేయొచ్చు. మరి మీరు కూడా ఈ సిరీస్ పై ఓ లుక్కేయ్యండి.

Exit mobile version