Nagababu: సంక్రాంతి పండగ మొదలయ్యిపోయింది. రేపటి నుంచి సంక్రాంతి సినిమాలు, హంగామా స్టార్ట్ కాబోతున్నాయి. నాలుగు సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఇక హీరో అభిమానులు థియేటర్లను అందంగా ముస్తాబు చేయడం.. కటౌట్ లు, ఫ్లెక్సీలు రెడీ చేసేశారు. ఇక సోషల్ మీడియాలో నాలుగు సినిమాలకు అభిమానులతో పాటు సెలబ్రిటిలు కూడా బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. తాజాగా హనుమాన్ కు నాగబాబు బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఆ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాడు.
“చూడాలనివుంది’ సినిమా లో ఊహ తెలీని వయసులోనే నీ నటనతో అందరని అలరించావ్ అప్పట్లోనే అన్నయ్య చిరంజీవి గారికి బుల్లిమెగా ఫ్యాన్ గా నాకు కనిపించావ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో మెప్పించావ్,అదే పంధాలో హీరోగా మొదటి సినిమా ‘జాంబిరెడ్డి’తోనే విభిన్న కథనంతో విజయాన్ని సాధించావ్,మరో వైవిధ్యమైన మైథలాజికల్ ఫాంటసీ జోనర్ తో వస్తున్నావ్, ట్రైలర్ విజువల్స్ లోనే చిత్ర విజయం ఖరారనిపిస్తోంది. కథానాయకుడిగా చిత్ర పరిశ్రమలో నీ ప్రయాణం ఎన్నో మైలు రాళ్లు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..నీ రెండో చిత్రమైన “హనుమాన్” కోసం చాల Excited గా ఎదరుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి హనుమాన్ తో తేజ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
చూడాలనివుంది’ సినిమా లో ఊహ తెలీని వయసులోనే నీ నటనతో అందరని అలరించావ్ అప్పట్లోనే అన్నయ్య చిరంజీవి గారికి బుల్లిమెగా ఫ్యాన్ గా నాకు కనిపించావ్
Child Artist గా ఎన్నో సినిమాల్లో మెప్పించావ్,అదే పంధాలో హీరోగా మొదటి సినిమా ‘జాంబిరెడ్డి’తోనే విభిన్న కథనంతో విజయాన్ని సాధించావ్,మరో… pic.twitter.com/pTDN6T0ll6
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 11, 2024