Site icon NTV Telugu

Nagababu: ఏ పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు విషం కక్కుతున్నారు.. ఏపీ మంత్రులపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!

Nagababu

Nagababu

Nagababu Strong Counter to Andhra Pradesh Ministers: మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తిప్పికౌడుతూ పెద్ద ఎత్తున ఏపీ మంత్రులు, అధికార పార్టీ నేతలు విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.

Kushi: విజయ్ దేవరకొండకి పోటీగా రంగంలోకి రష్మిక మాజీ ప్రియుడు..

ఆయన షేర్ చేసిన పోస్టు యధాతధంగా శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి,
వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ అని నాగబాబు అన్నారు.

ఏ పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు,ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడ ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు, ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది, మీ బతుక్కి మీ శాఖ ల మీద అవగాహన ఉండదు,అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదని నాగబాబు అన్నారు.

బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా..!, మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానం తో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ ధౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉంది..
NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది… ఆరోగ్యాలు జాగ్రత్త.! అంటూ ఆయన రాసుకొచ్చారు.

Exit mobile version