పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ పవన్ రోజురోజుకూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంటున్నారు. సోమవారం జరిగిన పవన్ రాజకీయ పార్టీ జనసేన ఆవిర్భావ సభను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఇసుక వేస్తే రాలనంత మంది జనసైనికులు పోటెత్తారు. ఇక ఈ కార్యకమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. నాగబాబు జనసేన పార్టీలో పీఏసీ సభ్యుడుగా ఉన్న విషయం తెలిసిందే. నిన్నటి బహిరంగ సభలో పవన్, నాగబాబు ఇచ్చిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా… తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Read Also : Brahmastra : అలియా బర్త్ డే ట్రీట్… ఇషాను పరిచయం చేసిన టీం
జనసేన ఆవిర్భావ సభకు సపోర్ట్ చేసినందుకు, ప్రేమను కురిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు నాగబాబు. “పారదర్శకమైన, అవినీతి రహిత పాలన కోసం… మెరుగైన, ధైర్యమైన రేపటి కోసం మా ప్రయాణానికి ఆజ్యం పోసేలా మీరు చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మన #జనసేనాని పవన్ కళ్యాణ్” అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
