Site icon NTV Telugu

తేజ్ హెల్త్ పై మెగా బ్రదర్ అప్డేట్

Sai Dharam Tej

నెల రోజుల క్రితం యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతానికి నెమ్మదిగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. తాజాగా తేజ్ హెల్త్ విషయమై మెగా బ్రదర్ నాగబాబు అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని, బాగానే ఉన్నాడని చెప్పారు. “తేజ్ ఆరోగ్యం బాగుంది. ఫిజియోథెరపీ జరుగుతున్నాయి. తేజ్ మరో 30-45 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడు. అతను రెండు నెలల్లో షూట్‌లకు కూడా హాజరు కావచ్చు. అయితే మరికొంత కాలం విశ్రాంతి తీసుకోమని మేము అతనికి సలహా ఇస్తున్నాము” అని నాగ బాబు అన్నారు.

Read Also : “సర్కారు వారి పాట” కోసం కీర్తి విదేశీ పయనం

ఇటీవల, సాయి ధరమ్ తేజ్ తాను బాగా కోలుకుంటున్నాను అని ట్వీట్ చేసాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఇక చాలా రోజుల నుంచి సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సమయంలో నాగబాబు తేజ్ మరో రెండు నెలల్లో షూటింగ్ లకు హాజరవుతారు అని చెప్పడం మెగా అభిమానులకు సంతోషం కలిగించే విషయం. ఇటీవలే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్” విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవ్ కట్టా దర్శకత్వం వహించగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది.

Exit mobile version