“సర్కారు వారి పాట” కోసం కీర్తి విదేశీ పయనం

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “సర్కారు వారి పాట” కోసం విదేశాలకు వెళ్ళింది. “సర్కారు వారి పాట” సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ ను స్పెయిన్ లోని బార్సిలోనాలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి చెన్నై నుంచి స్పెయిన్ కు చేరుకుంది కీర్తి. విమానంలో ఉన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపింది.

Read Also : “పికే లవ్” అంటూ మరోసారి తెరపైకి పూనమ్ కౌర్

ఈ చిత్రం షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమై తర్వాత హైదరాబాద్, గోవాలో షెడ్యూల్స్ లో షూటింగ్ ను పూర్తి చేశారు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న “సర్కారు వారి పాట” సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ మాది సినిమాటోగ్రాఫర్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక సంక్రాంతికి “సర్కారు వారి పాట” ప్రభాస్ “రాధే శ్యామ్”, పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి “భీమ్లా నాయక్‌”లతో ఢీకొంటుంది.

-Advertisement-"సర్కారు వారి పాట" కోసం కీర్తి విదేశీ పయనం

Related Articles

Latest Articles